దర్శకుడికి కార్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

6 Aug, 2016 10:19 IST|Sakshi
దర్శకుడికి కార్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

ఎన్టీఆర్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నాన్నకు ప్రేమతో. మాస్ ఇమేజ్ను ఎన్టీఆర్‌ను స్టైలిష్ లుక్‌లో చూపించటంతో పాటు, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అంతేకాదు 52  కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

ఈ సినిమా సక్సెస్‌తో ఫుల్ హ్యాపి ఫీల్ అయిన నిర్మాత బివియస్ఎన్ ప్రసాద్, దర్శకుడు సుకుమార్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. 52 లక్షల ఖరీదు చేసే బీయండబ్ల్యూ ఎక్స్3 సీరీస్ కారును సుకుమార్‌కు కానుకగా ఇచ్చాడు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు సుకుమార్. ఈ అక్టోబర్‌లో చెర్రీ సుకుమార్ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కబోతోంది.