ప్రకృతిని జయించలేను... క్షమించండి!

17 Mar, 2014 00:00 IST|Sakshi
ప్రకృతిని జయించలేను... క్షమించండి!
సినిమా తారలకు వయసు పైబడుతుంటే వారి అభిమానులకు ఆందోళనగా ఉంటుంది. వాళ్లు నిత్యయవ్వనంగా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. వయసు కనబడనివ్వకుండా ఆర్టిస్టులు కూడా యంగ్‌గా కనిపించడానికి జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, శారీరక మార్పులు స్పష్టంగా కనిపించేస్తాయి. ప్రస్తుతం ఈ విషయంలోనే హాలీవుడ్ తార కామరూన్ డయాజ్ ఆందోళన చెందుతున్నారు. ఆమె వయసు 41. కానీ, అభిమానులు మాత్రం 25 ఏళ్ల పడుచు పిల్లలా  కనిపించాలని కోరుకుంటున్నారట. ఎప్పటికీ తనని అలానే చూడాలని ఆశపడుతున్నారట. ఈ విషయం గురించి ప్రస్తావించి, తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు కామరూన్. నిజానికి తనకూ అలాగే కనిపించాలని ఉందని, కానీ వయసనేది ప్రకృతితో ముడిపడింది కాబట్టి దాన్ని జయించలేనని, అభిమానులను నిరుత్సాహపరుస్తున్నందుకు బాధగా ఉందని పేర్కొన్నారు కామరూన్.