ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా..?

8 May, 2018 16:09 IST|Sakshi
దివ్యాంక త్రిపాఠి షేర్‌ చేసిన ఫొటో

ఎంతో ముద్దుగా, బొద్దుగా ఉన్న ఫొటోలోని చిన్నారి.. ప్రస్తుతం హిందీ సీరియల్లలో నటిస్తూ ఉత్తమ కోడలు, భార్య అంటే ఇలాగే ఉండాలి అనేంతగా తన నటనతో కట్టిపడేస్తోంది. ఆమె ఎవరో కాదు ఇషిత అలియాస్‌ దివ్యాంక త్రిపాఠి. ఇద్దరు చిన్నారులతో కూడిన  ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన దివ్యాంక తను ఎక్కడున్నానో గుర్తుపట్టాలంటూ అభిమానుల్ని కోరుతూ.. చిన్ననాటి ఙ్ఞాపకాలను గుర్తుచేసుకుంది.

బనూ మేరీ దుల్హన్‌తో కెరీర్‌ ప్రారంభించిన దివ్యాంక యే హై మొహబ్బత్‌ సీరియల్‌తో బాగా పాపులర్‌ అయ్యారు. ఈ సీరియల్‌ మనసు పలికే మౌనగీతం పేరుతో ఓ ప్రముఖ తెలుగు ఛానెల్‌లో ప్రసారమైంది. ఈ సీరియల్‌లో ఇషితగా ప్రేక్షకుల మనసు దోచుకుంది దివ్యాంక. ఒక ఇల్లాలిగా.. తన కుటుంబాన్ని, తల్లిగా పిల్లలను సంభాళించుకునే తీరు, మల్టీటాస్కింగ్‌ ఉమెన్‌గా తను చూపిన ప్రతిభకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. అయితే తల్లి మినహా మిగిలినవన్నీ ఆమెలోని గుణాలే కాబట్టి.. యే హై మొహబ్బతేలో దివ్యాంక డాక్టర్‌ ఇషితా భల్లా పాత్రలో సహజంగా ఒదిగిపోయింది. కాబట్టే ఆ పాత్రకు అంత జీవం వచ్చింది. ఆమెకు రీల్‌ లైఫ్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ సాయం చేసే గుణం, సామాజిక స్పృహ కూడా ఎక్కువే. చిన్నపుడు టామ్‌బాయ్‌లా ఉండేందుకు ఇష్టపడిన దివ్యాంక.. ఇప్పుడు మాత్రం సాంప్రదాయ, ట్రెండీ లుక్స్‌తో అదరగొడుతున్నారు.

Guess which one is me? Hint...Spot the little #Gunda! BTW, Mummy you baked so many cakes😋 for me then! Miss those days of simple pleasures.

A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా