కేరాఫ్‌ కంచరపాలెం ట్రైలర్‌ .. ప్రముఖుల ప్రశంసలు

15 Aug, 2018 20:08 IST|Sakshi

కేరాఫ్‌ కంచరపాలెం సినిమా ట్రైలర్‌ బుధవారం సాయంత్రం విడుదలైంది.  చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. వెంకటేష్‌ మహా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరించారు. సినిమా ప్రీవ్యూకి మంచి స్పందన లభించింది.  సినీ ప్రముఖులు సుకుమార్‌, క్రిష్‌, అవసరాల శ్రీనివాస్‌, తరుణ్‌ భాస్కర్‌, ఎమ్‌ ఎమ్‌ కీరవాణి సినిమాను ప్రశంసలతో ముంచెత్తారు.

ఈ సినిమా నిర్మాత రానా దగ్గుబాటి స్పందిస్తూ... ‘‘ఈ సినిమాను మీ ముందుకు తీసుకువస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధించి గొప్పసినిమాగా నిలుస్తుందని ఆశిస్తున్నా’’నని అన్నారు. ఇక ట్రైలర్‌ విషయానికి వస్తే.. గ్రామీణ నేపథ్యంతో  పల్లె పరిస్థితులను, మనస్తత్వాలకు అద్దం పట్టేలా ఉంది. పల్లెటూరి హాస్యం అందరిని ఆకట్టుకుంటుంది.  ఈ సినిమా సెప్టెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు కాబోతోంది. 

మరిన్ని వార్తలు