టీనేజ్‌ లవ్‌స్టోరీ

8 Dec, 2018 01:20 IST|Sakshi
సాహితి, నిఖిల్‌

‘‘కేర్‌ ఆఫ్‌ వాట్సప్‌’ ట్రైలర్‌ చూస్తుంటే టీనేజ్‌ లవ్‌స్టోరీ అని అర్థం అవుతోంది. యాక్షన్, ఎమోషన్స్‌ ఉన్నప్పుడే సినిమా బాగా ఆడుతుంది. అవి ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫైట్స్, సాంగ్స్‌ బాగున్నాయి. టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అని డైరెక్టర్‌ సముద్ర అన్నారు. ‘బాహుబలి’ చిత్రంలో చిన్నప్పటి ప్రభాస్‌ పాత్ర చేసిన నిఖిల్‌ హీరోగా, సాహితి హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘కేర్‌ ఆఫ్‌ వాట్సప్‌’.  నీరజ ప్రధాన పాత్రలో నటించారు. అల్లాడి రవీందర్‌ రెడ్డి దర్శకత్వంలో లక్ష్మికాంత్‌ రెడ్డి నిర్మించారు.

ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్‌ సముద్ర రిలీజ్‌ చేయగా, ఆడియో సీడీలను నటుడు నోయల్‌ విడుదల చేశారు. రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘వాట్సప్‌తోనే రోజు మొదలవుతుంది.. వాట్సప్‌తోనే రోజు ముగుస్తుంది. ఇలాంటి తరుణంలో మా సినిమా అందరికీ ప్రతి రోజూ గుర్తుకు రావాలనే ఈ టైటిల్‌ పెట్టాం. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. మంచి కథాం శంతో తెరకెక్కింది. అతి త్వరలోనే సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు లక్ష్మీకాంత్‌ రెడ్డి. ఈ చిత్రానికి సమర్పణ: రామ్‌ రెడ్డి, సహ నిర్మాత: కొండా రాఘవేంద్ర రెడ్డి (దేవ కర్ర), సంగీ తం: రాజేష్‌ తేలు, కెమెరా: భాస్కర్‌ దోర్నాల.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా