హీరో అక్షయ్‌ కుమార్‌పై కేసు నమోదు

8 Jan, 2020 16:50 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల అక్షయ్‌ నటించిన యాడ్‌కు సంబంధించి ఆయనపై మరాఠాలు మండిపడ్డారు. ఓ వాషింగ్‌ పౌడర్‌ కంపెనీ ప్రచారానికి సంబంధించిన యాడ్‌లో అక్షయ్‌ మరాఠా యోధుడిగా కనిపించారు. అయితే  ఆ యాడ్‌లో అక్షయ్‌ పాత్ర తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందని మరాఠాలు ఆరోపిస్తున్నారు. దీనిపై అక్షయ్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ప్రకటనకు సంబంధించిన అన్ని వీడియోలను, ఫొటోలను ఆన్‌లైన్‌లో నుంచి తొలగించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే వారి ఫిర్యాదు మేరకు ముంబైలోని వర్లీ పోలీస్‌ స్టేషన్‌లో అక్షయ్‌పై కేసు నమోదైంది. అయితే ఇందుకు సంబంధించి అక్షయ్‌ వైపు నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 

మరోవైపు సోషల్‌ మీడియాలో అక్షయ్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఆ వాషింగ్‌ పౌడర్‌ను బాయ్‌కాట్‌ చేయాలని ట్వీట్‌లు చేస్తున్నారు. ‘అక్షయ్‌ ఎప్పుడైనా మరాఠాల చరిత్ర చదివారా?. మీకు తెలియకపోతే.. వారు దేశానికి చేసిన త్యాగాలను ముందుగా తెలుసుకోండి. అంతేకానీ మరాఠా సంస్కృతిని ఎగతాళి చేయకండి’ అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా