సుల్తాన్ టీంపై చీటింగ్ కేసు

13 Jul, 2016 11:47 IST|Sakshi
సుల్తాన్ టీంపై చీటింగ్ కేసు

స్టార్ హీరోల సినిమాలకు వివాదాలు తప్పటం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో ఈ వివాదాలు కామన్ అయిపోయాయి. తాజాగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సల్మాన్ ఖాన్ సుల్తాన్‌పై వివాదం రేగుతోంది. తన జీవితం ఆధారంగానే సుల్తాన్ సినిమాను తెరకెక్కించారంటూ ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.

ముజఫర్‌నగర్‌కు చెందిన మొహ్మద్ సాబిర్ అన్సారి అలియాస్ సాబిర్ బాబా,  2010లో తన ఆత్మకథను సల్మాన్‌కు వినిపించాడట. అయితే ఆ సమయంలో ఇదే కథతో సినిమాను రూపొందిస్తే తనకు 20 కోట్ల రూపాయల రాయల్టీ ఇస్తానని సల్మాన్ మాట ఇచ్చాడని, ఇప్పుడు సుల్తాన్ సినిమాను అదే కథతో తెరకెక్కించినా, తనకు ఎలాంటి రాయల్టీ ఇవ్వలేదని ఆరోపిస్తున్నాడు సాబిర్.

అందుకే తనను మోసం చేసిన సల్మాన్ ఖాన్‌తో పాటు ఆ చిత్ర హీరోయిన్ అనుష్క శర్మ, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్లపై చీటింగ్ కేసు వేశాడు. ఈ నెల 8న ఈ వివాదానికి సంబందించి ముజఫర్‌నగర్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సాబిర్ తరుపు న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా కేసు ఫైల్ చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి