తాగుబోతుల వీరంగం.. దర్శకుడికి గాయాలు

20 Jun, 2019 13:02 IST|Sakshi

టీవీ దిగ్గజం ఏక్తా కపూర్‌ తెరకెక్కిస్తోన్న ‘ఫిక్సర్‌’ వెబ్‌ సిరీస్‌ నటులు, సిబ్బంది మీద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నటి తిగ్మాంషు ధులియా దాడికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ.. ఓ వీడియోను తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. నటి మహీ గిల్‌, నిర్మాత సాకేత్‌ సాహ్నీ, దర్శకుడు సోహమ్‌ షాతో ఇతర సిబ్బందిని కూడా ఈ వీడియోలో చూడవచ్చు.

తిగ్మాంషు ధులియా మాట్లాడుతూ.. ‘షూటింగ్‌ జరుగుతుండగా నలుగురైదుగురు యువకులు కర్రలతో మా దగ్గరకు వచ్చారు. ఉన్నట్టుండి మా మీద దాడి చేయడం ప్రారంభించారు. తొలుత మేం దీన్ని కామెడీగా తీసుకున్నాం. కానీ వారు నిజంగానే మా మీద దాడి చేస్తున్నారని కాసేపటి తర్వాత అర్థమయ్యింది. ఈ దాడిలో మా దర్శకుడు సోహమ్‌ షా కింద పడిపోయాడు.. ఓ కెమరామ్యాన్‌కి తీవ్ర గాయాలయ్యి రక్తం వచ్చింద’ని తెలిపారు. తమ మీద దాడి చేసిన వారు ఆ ప్రాంతంలో రౌడీలుగా చెలామణి అవుతున్నారన్నారు. వారి అనుమతి లేకుండా అక్కడ షూటింగ్‌ చేయకూడదని సదరు గ్యాంగ్‌ తమను హెచ్చరించిందన్నారు ధులియా.

దర్శకుడు సోహమ్‌ షా మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంతంలో షూటింగ్‌ చేయడానికి మేం పర్మిషన్‌ తీసుకున్నాం. అందుకు సంబంధించి డబ్బు కూడా చెల్లించాం. ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ షూటింగ్‌ చేస్తున్నాం. వీరు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వచ్చి ఇక్కడ షూటింగ్‌ చేయకూడదంటూ మా మీద దాడి చేశార’ని పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా