నన్ను అందుకే వాడుకుంటున్నారు

23 Mar, 2016 03:03 IST|Sakshi
నన్ను అందుకే వాడుకుంటున్నారు

నన్ను గ్లామర్‌కే వాడుకుంటున్నారని తెగ బాధ పడిపోతోంది నటి క్యాథరిన్ ట్రెసా. కోలీవుడ్‌లో గట్టి పోటీ ఉన్నా అవకాశాలను బాగానే రాబట్టుకుంటోంది ఈ అమ్మడు. తెలుగులో ఇద్దరమ్మాయిలతో చిత్రంలో అందాలారబోతలో దుమ్మురేపిన ఈ దుబాయ్ బ్యూటీ తమిళలోకొచ్చేసరికి మెడ్రాస్ చిత్రంలో పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో బాగానే నటించింది. ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందడంతో ఇకపై అలాంటి నటనకు అవకాశం ఉన్నా మంచి పాత్రలు వస్తాయని ఆశించింది. అయితే అనుకున్నదొక్కటీ అయ్యింది ఒక్కటి అన్నట్టుగా క్యాథరిన్ పరిస్థితి మారింది.

ఆ తరువాత విశాల్ సరసన కథకళి, అధర్వతో కణిదన్ చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలు విజయం సాధించినా వాటిలో ఈ అమ్మడు గ్లామర్‌డాల్ పాత్రలకే పరిమితమైంది. దీంతో ఎంతో బాధ పడిపోతున్న క్యాథరిన్ ట్రెసా తనను దర్శక నిర్మాతలు గ్లామర్‌కే వాడుకుంటున్నారని తెగ ఇదైపోతోంది. మోడ్రన్  పేరుతో కురచ దుస్తులు ధరింపజేస్తున్నారని వాపోతోంది. గ్లామరస్ పాత్రలతో అభిమానులు పెరుగుతున్నారన్నది కాస్త సంతోషంగా ఉన్నా మరీ అలాంటి పాత్రలకే ట్రేడ్ మార్క్‌గా మార్చేయడం బాధగా ఉందని పేర్కొంది. ఎన్ని చిత్రాలు చేశామన్నది కాకుండా ఎంత మంచి పాత్రలు పోషించామన్నదే లెక్కకొస్తుందనీ అలా చెప్పుకునే మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని క్యాథరిన్ ట్రెసా అంటోంది.నటనకు అవకాశం ఉన్న పాత్రలు లభిస్తే తన సత్తా చాటుకుంటానని పేర్కొంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా