10 May, 2018 11:00 IST|Sakshi

రంగస్థలం సినిమాతో ఘనవిజయం సాధించిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భరత్‌ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస‍్తున్నారు. బోయపాటి సినిమాలో భారీ యాక్షన్‌ సీన్స్‌తో పాటు ఓ మాస్‌ మసాలా ఐటమ్‌ సాంగ్‌ కూడా కంపల్సరీ. అందుకే చరణ్ సినిమాలో కూడా ఐటమ్‌ సాంగ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు బోయపాటి.

ఈ స్పెషల్‌ సాంగ్‌లో చరణ్ సరసన కేథరిన్‌ థ్రెస్సా ఆడిపాడినున్నారు. గతంలో బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడు సినిమాలో కీలక పాత్రలో నటించిన కేథరిన్‌, తరువాత జయ జానకి నాయకలో స్పెషల్‌ సాంగ్‌లో మెరిశారు. ఇప్పుడు మరోసారి బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చరణ్ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనున్నారు కేథరిన్‌.

మరిన్ని వార్తలు