బిగ్ బాస్ హౌస్లో టాప్ స్టార్స్..?

6 Jul, 2017 10:41 IST|Sakshi
బిగ్ బాస్ హౌస్లో టాప్ స్టార్స్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా బిగ్ బాస్ షోతో బుల్లితెర మీద అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ షోకు సంబంధించి తాజాగా మరిన్ని ఇంట్రస్టింగ్ అప్ డేట్స్ టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ షోను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చానల్ నిర్వహకులు టాప్ స్టార్స్ను తెర మీదకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే కొంతమందిని షోలో పాల్గొనేందుకు ఒప్పించారన్న ప్రచారం జరుగుతోంది. షో నిర్వాహకులు ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. నటుడు పోసాని కృష్ణమురళి, ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ రంభ, స్నేహ, సదా, స్టార్ వారసురాలు మంచు లక్ష్మీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారట. వీరితో పాటు ప్రముఖ మత ప్రచారకుడు కేఏ పాల్ కూడా షోలో పాల్గొననున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

ఇంత వరకు షో నిర్వహకులుగాని, చానల్ వారు గాని షోలో పాల్గొనబోయే సెలబ్రిటీల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అసలు షోలో పాల్గొనేది ఎవరు.. అన్న విషయం తెలియాలంటే ఈ నెల 16న షో ప్రారంభమయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.