కొత్త జంటకు శుభాకాంక్షల వెల్లువ

7 Oct, 2017 17:35 IST|Sakshi

వెండితెర మీద హిట్ పెయిర్ అనిపించుకున్న నాగచైతన్య, సమంతలు నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. కొద్ది రోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన వీరి పెళ్లి వేడుక చివరి అంకానికి చేరుకుంది. శుక్రవారం తెలుగు సాంప్రదాయం ప్రకారం ఒక్కటైన ఈ జంట, శనివారం క్రిస్టియన్ సాంప్రదాయ పద్దతిలో మరోసారి పెళ్లికి సిద్ధమవుతున్నారు.

అయితే శుక్రవారం జరిగిన పెళ్లి వేడుకకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానుల కోసం తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు కింగ్ నాగార్జున. రాత్రి 11.52 నిమిషాలకు పెద్దల సమక్షంలో పెళ్లి తంతు ముగిసింది. అప్పటి నుంచి ఈ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు వీరికి సోషల్ మీడియాద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు సమంత.

మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు