రంగనాథ్‌కు ప్రముఖుల నివాళి

20 Dec, 2015 16:15 IST|Sakshi
రంగనాథ్‌కు ప్రముఖుల నివాళి

హైదరాబాద్‌ : సీనియర్ నటుడు రంగనాథ్ మృతితో తెలుగు సినీ ప్రరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. శనివారం సాయంత్రం ముషీరాబాద్‌ పరిధిలోని గాంధీనగర్‌లో అద్దె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ రంగనాథ్‌కు ఆదివారం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాధాతప్త హృదయాలతో కన్నీటి నివాళులర్పించారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

గాంధీ ఆసుపత్రిలో రంగనాథ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్‌కు తీసుకువచ్చారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు చిరంజీవి, మురళీ మోహన్, జమున, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, గిరిబాబు, శివాజీరాజా, పలువురు నివాళులు అర్పించారు. రంగనాథ్ మృతి తెలుగుసినీ పరిశ్రమకు తీరనిలోటని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి