బాలీవుడ్ నటికి పుత్రశోకం

3 Oct, 2017 14:17 IST|Sakshi

ఇటీవల కవలలకు జన్మనిచ్చిన బాలీవుడ్‌ నటి సెలీనా జైట్లీ ఇంట విషాదం నెలకొంది. తనకు జన్మించిన ఇద్దరు పిల్లల్లో ఒకరు అనారోగ్యం కారణంగా మరణించారు. పుట్టుకతోనే తీవ్ర హృదయ సంబంధ సమస్యతో జన్మించిన బాబు, చనిపోయాడని సెలీనా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేసింది.

తొలి కాన్పులోనూ సెలీనా దంపతులకు కవలలే జన్మించారు. 35 ఏళ్ల సెలీనాకు తొలి కాన్పులో జన్మించిన విన్ స్టన్, విరాజ్ లకు ప్రస్తుతం ఐదేళ్లు. సెప్టెంబర్ 10న మరోసారి కవలలకు జన్మనిచ్చిన ఆనందం వారి ఇంట ఎన్నో రోజులు నిలవలేదు. వారిలో ఒక బాబును మరణించటం సెలీనా ఇంట్లో విషాదం నింపింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా