'పీకే మూవీ నుంచి ఎటువంటి సీన్స్ తొలగించం'

29 Dec, 2014 11:17 IST|Sakshi
'పీకే మూవీ నుంచి ఎటువంటి సీన్స్ తొలగించం'

ఢిల్లీ:  బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన పీకే చిత్రంలో అభ్యంతకరమైన సీన్స్ ఉన్నాయని.. వాటిని తక్షణమే తొలగించాలని నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సెన్సార్ బోర్డు స్పందించింది.  పీకే చిత్రంలోని ఎటువంటి సన్నివేశాలను తొలగించాల్సిన అవసరం లేదని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. దీనిపై  సెన్సార్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)  చైర్ పర్సన్ లీలీ శాంసన్ మాట్లాడుతూ..  ఇప్పటికే చిత్రం విడుదలైన నేపథ్యంలో ఎటువంటి సీన్స్ లను తొలగించేందుకు బోర్డు సిద్ధంగా లేదని పేర్కొన్నారు.


డిసెంబర్ 19వ తేదీన విడుదలైన 'పీకే' చిత్రంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై హిందువులే కాకుండా ముస్లింలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిషేధం విధించాలంటూ ఆదివారం పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి.  హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని వీహెచ్‌పీ, బజ్‌రంగ్ దళ్, హిందూ జనజాగతి సమితి, అఖిల భారత మహాసభ ఆరోపించాయి.