డాటర్‌ ఆఫ్‌ కపూర్స్‌

24 Aug, 2018 05:24 IST|Sakshi
సోనమ్ కపూర్‌, సంజయ్‌ కపూర్‌

ఆఫ్‌ స్క్రీన్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ ఆన్‌ స్క్రీన్‌ కలిసి యాక్ట్‌ చేస్తే ఆ యాక్టర్స్‌కే కాదు ప్రేక్షకులకు కూడా చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇప్పుడదే థ్రిల్లింగ్‌ మూమొంట్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు సోనమ్‌. ఒకసారి కాదు వరుసగా రెండోసారి తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి యాక్ట్‌ చేస్తున్నారు సోనమ్‌. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘ఏక్‌ లడ్కీకో దేఖాతో ఏశా లగా’ సినిమాలో తండ్రి అనిల్‌ కపూర్‌తో తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. ఇందులో సోనమ్, అనిల్‌ తండ్రీ కూతుళ్లుగా కనిపించనున్నారు.

ఈ సినిమా తర్వాత మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి యాక్ట్‌ చేస్తున్న ‘జోయా ఫ్యాక్టర్‌’లో సోనమ్‌ బాబాయ్‌ సంజయ్‌ కపూర్‌ కూడా యాక్ట్‌ చేయబోతున్నారట. బాబాయ్‌ సంజయ్‌ కపూర్‌ ఈ సినిమాలో సోనమ్‌కి తండ్రిగా కనిపిస్తారట. ఆల్రెడీ ‘ముబారకన్‌’ సినిమాలో అన్నయ్య అనిల్‌ కపూర్, మరో అన్నయ్య బోనీ కపూర్‌ కుమారుడు అర్జున్‌ కపూర్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు సంజయ్‌. ‘‘సోనమ్‌ నా కళ్ల ముందే పెరిగింది. తను నా కూతురు లాంటిదే. తనతో వర్క్‌ చేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి వర్క్‌ చేయడం కంటే హ్యాపీ ఏం ఉంటుంది’’ అన్నారు సంజయ్‌కపూర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా