అంతరిక్షంలో టిక్‌ టిక్‌

23 Jan, 2018 04:55 IST|Sakshi

‘జయం’ రవి, నివేదా పేతురాజ్‌ జంటగా శక్తి సౌందర్‌ రాజన్‌ దర్శకత్వంలో అంతరిక్ష  (స్పేస్‌) నేపథ్యంలో తెరకెక్కిన తొలి చిత్రం ‘టిక్‌ టిక్‌ టిక్‌’. చదలవాడ బ్రదర్స్‌ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్‌ బ్యానర్‌పై పద్మావతి చదలవాడ ఈ చిత్రాన్ని తెలుగులో త్వరలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘జనవరి 1న నేను ఫ్రాన్స్‌లోని ఈఫిల్‌ టవర్‌పై కూర్చున్నప్పుడు ఓ ఫారిన్‌ కపుల్‌ వచ్చి, ‘మీది ఇండియానా?’ అనడిగారు. అవునని చెప్పా. ‘బాహుబలి’ పదిసార్లు చూశామన్నారు. మన ఇండియన్‌ సినిమాకి అంత గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ మనవాళ్లు అమెరికన్‌ సినిమాలు చూస్తారు.

అటువంటి స్థాయిలో తీసిన సినిమా ‘టిక్‌ టిక్‌ టిక్‌’’ అన్నారు. ‘‘మన దేశంలో వచ్చిన ఫస్ట్‌ స్పేస్‌ ఫిల్మ్‌ ఇది. ఇటువంటి సినిమాలను ఈజీగా చేయలేం. ఒక్కొక్క షాట్‌ వెనుక చాలా కష్టం ఉంటుంది. టీజర్, ట్రైలర్లలో ప్రేక్షకులు చూసినదాని కంటే సినిమాలో పది రెట్లు ఎక్కువ ఉంటుంది’’ అన్నారు ‘జయం’ రవి. ‘‘స్టార్‌ వార్స్‌’ టైమ్‌ నుంచి స్పేస్‌ నేపథ్యంలో ఇండియాలో ఎవరు సినిమా చేస్తారా? అనుకునేవాణ్ణి. తమిళంలో ‘టిక్‌ టిక్‌ టిక్‌’ చేస్తున్నారని తెలిసి పోటీ ఎక్కువగా ఉన్నా తెలుగు హక్కులు తీసుకున్నాం. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు చదలవాడ లక్ష్మణ్‌. దర్శకులు అజయ్, అల్లాణి శ్రీధర్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం:  డి.ఇమ్మాన్, కెమెరా: వెంకటేశ్‌.

మరిన్ని వార్తలు