ఆధునికంగా... చందమామ కథలు

2 Mar, 2014 00:26 IST|Sakshi
ఆధునికంగా... చందమామ కథలు
మనిషికి ఎదురయ్యే అనుభవాలు, వాటి పర్యావసానాలు, ఫలితాల నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘చందమామ కథలు’. సీనియర్ నరేష్, ఆమని, మంచు లక్ష్మీప్రసన్న, కృష్ణుడు, కిషోర్, అభిజిత్, రీచా పనయ్, చైతన్యకృష్ణ, షామిలి, శౌర్య, అమితారావ్, ఇషా రంగనాథ్, కృష్ణేశ్వరరావు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు ప్రవీణ్ సత్తారు. నిర్మాత చాణక్య బూనేటి. మిక్కీ జె.మేయర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో అధునిక పద్ధతిలో చిత్రం యూనిట్ సభ్యులు విడుదల చేశారు. దర్శకుని అభిరుచి, నిర్మాత ఇచ్చిన ఫ్రీడమ్, మంచి సాహిత్యం... వల్లే మంచి సంగీతం అందించగలిగానని, ఈ సినిమా బాగా వచ్చిందంటే... ఆ క్రెడిట్ టీమ్ అందరిదీ అని మిక్కీ జే మేయర్ చెప్పారు.
 
  ‘‘ప్రవీణ్ సత్తారుతో పనిచేశాక... నేను కాస్త లేట్‌గా పుట్టి ఉంటే బావుండేదే అనిపించింది’’ అని నరేష్ చెప్పారు. అందరం కమిట్‌మెంట్‌తో వర్క్ చేశామని, ఇందులో తన పాత్ర డిఫరెంట్‌గా ఉంటుందని మంచు లక్ష్మి అన్నారు. సీడీల్లో పాటలు వినే రోజులు పోయాయి కాబట్టి, తామే సొంతంగా వర్కింగ్ డ్రీమ్ మ్యూజిక్‌ని నెలకొల్పి, డిజిటల్ ఫార్మెట్‌లో పాటల్ని విడుదల చేస్తు న్నామని, ఈ కథలో పాటలే కీలకమని, అన్నీ వాస్తవానికి దగ్గరగా ఉంటాయని ప్రవీణ్ సత్తారు తెలిపారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెల 14న సినిమా విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. అతిథిగా పాల్గొన్న మనోజ్‌తో పాటు చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.