ఇకపై చిత్ర నిర్మాణం చేపట్టను

28 Oct, 2016 02:12 IST|Sakshi
ఇకపై చిత్ర నిర్మాణం చేపట్టను

ఇకపై సొంతంగా చిత్రాలు తీయనని ప్రముఖ దర్శకుడు ప్రభుసాల్మన్ పేర్కొన్నారు. మైనా, కుంకీ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడైన ఈయన తాజా చిత్రం తొడరి ఆశించిన విజయం సాధించలేదు. కాగా ప్రభుసాల్మన్ నిర్మాతగా తన గాడ్ ఫిక్చర్స్ పతాకంపై రూపొందించిన చిత్రం రూపాయ్.ఆర్‌పీకే.ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ అధినేత ఆర్.రవిచంద్రన్ సహనిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో కయల్ ఫేమ్ చంద్రన్, ఆనంది హీరోహీరోయిన్లుగా నటించారు. కిషోర్వ్రిచంద్రన్, చిన్నిజయంత్, హరీష్‌ఉత్తమన్, ఆర్‌ఎన్‌ఆర్, మనోహర్, మారిముత్తు, వెట్రివేల్‌రాజా ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి అన్భళగన్ దర్శకత్వం వహించారు.

డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడిమో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ తన తొలి చిత్రం సాటైట్ తరహాలోనూ ఇదీ వైవిధ్యంగా ఉంటుందన్నారు. అయితే కథ, కథనాలు మరో కోణంలో ఉంటాయని తెలిపారు. డబ్బు మోహం ఎలాంటి సమస్యలకు కారణం అవుతుందనే ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం రూపాయ్ అని వివరించారు. అనంతరం చిత్ర నిర్మాత దర్శకుడు ప్రభుసాల్మన్ మాట్లాడుతూ ఇంతకు ముందు తాను నిర్మించిన సాటైట్ చిత్ర సాటిలైట్ హక్కులే 1.25 కోట్లకు అమ్ముడు పోయాయన్నారు. అలాంటిది ఈ చిత్రం శాటిలైట్ విక్రయణే జరగలేదని చెప్పారు. ఇకపై తాను నిర్మాతగా చిత్రాలు చేయనని చెప్పారు. కారణం ప్రస్తుత పరిస్థితి అంత దయనీయంగా ఉందని వ్యా ఖ్యానించారు. ఈ చిత్రాన్ని ఈ 5 జేకే.గ్రూప్స్ అధినేత డా.జే.జయక్రిష్ణన్, కాస్మో విలేజ్ శివకుమార్ కలిసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.