అభిమన్యు నారాయణ

30 Jun, 2017 00:37 IST|Sakshi
అభిమన్యు నారాయణ

∙రంగస్థల కథానాయకుడు
‘రంగస్థలం 1985’... రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. గుబురు గడ్డం, గళ్ల లుంగీతో ఇప్పటికే ఈ చిత్రంలో చరణ్‌ గెటప్‌ చాలామందిని ఆకట్టుకుంది. ఇలా కాకుండా వేరే గెటప్‌లోనూ కనిపిస్తారా? అని చెప్పడానికి ఇంకాస్త టైమ్‌ పడుతుంది.
ఇప్పుడు మాత్రం ఇందులో చరణ్‌ చేస్తున్న పాత్ర పేరు ‘అభిమన్యు నారాయణ’ అని టాక్‌. ‘అభిమన్యు నారాయణ’.. రంగస్థల కథానాయకుడు అనే బోర్డ్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చరణ్‌ రంగస్థల నటుడి పాత్ర చేస్తున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. సో.. అభిమన్యు అనేది చరణ్‌ పాత్ర పేరే అయ్యుంటుందా? లేక వేరే పాత్ర పేరా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సమంత కథానాయికగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఎర్నెని నవీన్, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు.