ప్రాస్టిట్యూట్ పాత్ర చేయమని అడిగితే...

24 Jul, 2013 02:47 IST|Sakshi
ప్రాస్టిట్యూట్ పాత్ర చేయమని అడిగితే...
 ‘‘దర్శకుడు చందు నన్ను కలిసి ప్రాస్టిట్యూట్ పాత్ర చేయమని అడిగితే, నేను ఆసక్తి కనబరచలేదు. అయితే కథ విన్నాక వెంటనే కనెక్ట్ అయిపోయాను. కై ్లమాక్స్‌లో కన్నీళ్లు వచ్చేశాయి. నేనీ సినిమా చేయకపోతే కచ్చితంగా ఓ మంచి సినిమా మిస్సయిపోయేదాన్ని’’ అని చార్మి చెప్పారు. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ప్రేమ ఒక మైకం’. చందు దర్శకత్వంలో టూరింగ్ టాకీస్ పతాకంపై డి.వెంకట సురేష్, కె.సూర్య, శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
 ‘హ్యాపీడేస్’ రాహుల్, ‘ప్రేమిస్తే’ శరణ్య, రవిబాబు, రావు రమేష్, సతీష్ ఇందులో ముఖ్యతారలు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఓ వేశ్య, ఓ గాయకుడు, ఓ రచయిత మధ్య సాగే మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది. చార్మి నటనే ఈ సినిమాకు మెయిన్ హైలైట్. కథాకథనాలు, సంభాషణలు, పాటలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. 
 
 వచ్చే నెలలో ఈ సినిమా విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఆర్.పోశం, కెమెరా: ప్రవీణ్ కె.బంగారి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: పి.ప్రతాప్, గీతానంద్‌రెడ్డి, సహనిర్మాత: జితిన్ చక్రవర్తి, సమర్పణ: బేబి హ్యాపీ.
 
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా