తెలుగు వారికి ప్రాధాన్యం ఇవ్వండి

4 Feb, 2019 02:34 IST|Sakshi
కనగాల రమేశ్, పద్మాలయ మల్లయ్య, శివాజీరాజా, విక్కీరాజ్‌

– ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా

‘‘తెలుగు సినిమాలో తమిళ నటీనటులు ఉండొచ్చా? లేదా? అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ, ఉంటే అనువాద చిత్రం అనే భావన వస్తుంది. మన తెలుగు వాళ్లను మనం తీసుకుంటే ఇంకా బాగుంటుంది. హీరోయిన్స్‌ ఎలాగూ తప్పదు.. చిన్న చిన్న నటీనటులను కూడానా? మన వారికి ప్రాధాన్యం  ఇవ్వండి. వాళ్లు కుదరకపోతేనే ఇతర భాషల వారిని తీసుకురండి’’ అని నటుడు, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రలో అమర్, ప్రదీప్‌వర్మ, ఉదయ్, అభి, సి.టి., ఖాదర్, లక్ష్మి, శృతి, కావ్య, దేవి, వీణ, జాస్మిన్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్‌’. కనగాల రమేష్‌ చౌదరి దర్శకత్వం వహించారు.

రాజ్‌ ప్రొడక్షన్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై విక్కీరాజ్‌ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. రమేష్‌ చౌదరి మాట్లాడుతూ– ‘‘30ఏళ్లుగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, కో– డైరెక్టర్‌గా పని చేస్తున్న నేను ‘చెడ్డీ గ్యాంగ్‌’ సినిమాతో దర్శకుడిగా మారాను. పదిమంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కేరళ అడవులకు టూర్‌కు వెళతారు. అక్కడి కోయవారి నిబంధనలను అతిక్రమించి ఓ సమస్యలో ఇరుక్కుంటారు. ఆ తర్వాత వాళ్లు ఎలా బయటపడ్డారనేదే ఈ చిత్ర కథాంశం’’ అన్నారు. ‘‘మలేషియాలో తెరకెక్కించిన క్లైమాక్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. బాలీవుడ్‌ బ్యూటీ స్నేహా కపూర్‌ చేసిన ఐటమ్‌ సాంగ్‌ యువతను ఆకట్టుకుంటుంది’’ అని విక్కీరాజ్‌ అన్నారు. సెన్సార్‌ సభ్యులు ఎంఎస్‌ రెడ్డి, పాటల రచయిత లక్ష్మణ్, పద్మాలయ మల్లయ్య పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు