అందుకే హోమ్‌ బ్యానర్లో చేయలేదు

31 Jul, 2018 01:36 IST|Sakshi
సుశాంత్

‘‘వరుసగా ఫార్ములా సినిమాలు చేయడం విసుగు తెప్పించింది. నాకు సరిపోయే క్యూట్‌ లవ్‌స్టోరీ చేయాలని ఫిక్స్‌ అయిన టైమ్‌లో రాహుల్‌ ఈ కథతో నా దగ్గరకు వచ్చారు. స్టోరీ బాగా నచ్చడంతో వెంటనే అంగీకరించాను’’ అన్నారు సుశాంత్‌. నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో సుశాంత్, రుహానీ శర్మ జంటగా రూపొందిన చిత్రం ‘చి ల సౌ’. సిరుని సినీ కార్పొరేషన్‌ బ్యానర్‌పై జస్వంత్‌ నడిపల్లి, భరత్‌ కుమార్‌ మలశాలి, హరి పులిజల నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్‌ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుశాంత్‌ పంచుకున్న విశేషాలు.

► రిస్క్‌ తీసుకోవాలనే ఆలోచనతో హోమ్‌ బ్యానర్‌లో వర్క్‌ చేయకూడదు అనుకున్నాను. రాహుల్‌ కూడా నేను ప్రొడ్యూస్‌ చేస్తానని నాతో ఈ సినిమా చేయలేదు. సినిమా మొత్తం అయిపోయాక చూసిన నాగచైతన్య, సమంత అన్నపూర్ణ బ్యానర్‌ నుంచి రిలీజ్‌ చేయడానికి రెడీ అయి, మా ప్రొడ్యూసర్స్‌ని అడిగారు. వాళ్లు వెంటనే ఒప్పుకున్నారు.

► సినిమా చూశాక నాగ్‌ (నాగార్జున) మామ మా అమ్మగారితో చాలాసేపు మాట్లాడారు. ‘మంచి స్టోరీ సెలెక్ట్‌ చేసుకున్నాడు, ఇలానే చేసుకుంటూ వెళ్తే కెరీర్‌ బావుంటుంది’ అన్నారట. ఆయన అలా అనడం పెద్ద సర్టిఫికెట్‌లా భావిస్తాను. మామ నుంచి అందుకున్న బెస్ట్‌ కాంప్లిమెంట్‌ అదే అని ఫీల్‌ అవుతాను.

► నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. బయట ఎలా ఉంటానో సినిమాలో కూడా అలానే కనిపిస్తాను. దాని కోసం వర్క్‌ షాప్‌ కూడా చేశాం. సహజంగా ఉండటం కోసం మేకప్‌ కూడా వాడలేదు.
 

► రాహుల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేయకపోయినా హీరోగా చాలా గమనించే ఉంటారు. స్టోరీ కూడా చాలా బాగా నరేట్‌ చేశారు. ముందుగా ఈ సినిమాకు  ‘చిరంజీవి అర్జున్‌’ అనుకున్నాం కానీ ‘అర్జున్‌ రెడ్డి’ సూపర్‌ హిట్‌ అయింది. దాంతో ‘చి ల సౌ’ అని మార్చాం.

► ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ అందరూ హ్యాపీగా ఎంజాయ్‌ చేయవచ్చు. నెక్ట్స్‌ ఓ ఫన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో సినిమా ఓకే చేశాను.

మరిన్ని వార్తలు