అచ్చ తెలుగు అమ్మాయిని

20 Jul, 2020 02:23 IST|Sakshi
కావ్య

కావ్య... ఈ పేరు బహుశా ఎవరికీ తెలియకపోచ్చు. కానీ  అల్లు అర్జున్‌ మొదటి సినిమా ‘గంగోత్రి’లోని ‘వల్లంకి పిట్ట.. వల్లంకి  పిట్ట...’ పాటని గుర్తు చేస్తే టక్కున ఆ పాటలోని చిన్నారి పాప గుర్తొస్తుంది. ఆ పాపే కావ్య.  ఇప్పుడు తను హీరోయిన్‌ కాబోతోంది. తెలుగమ్మాయి అయిన కావ్య పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ – ‘‘బాలు, అడవిరాముడు, అందమైన మనసులో, విజయేంద్రవర్మ’తో పాటు ఇంకా చాలా సినిమాల్లో బాలనటిగా చేశాను. పుణెలోని ఓ కాలేజీలో లా పూర్తి చేసి, ఇప్పుడు సినిమా వైపు దృష్టి పెట్టాను.

తెలుగుతో పాటు తమిళ, మళయాళ సినిమాలకు కూడా ఆడిష¯Œ ్స చేస్తున్నాను. నిజానికి లాక్‌ డౌన్‌కి ముందుగానే ట్రయిల్స్‌ స్టార్ట్‌ చేశాను. లాక్‌ డౌన్‌ రాకుండా ఉంటే ఓ ప్రాజెక్ట్‌ ఓకే అయ్యేది. నేను తెలుగు అమ్మాయిని కావడం అడ్వాంటేజ్‌గా ఫీలవుతున్నాను. మన తెలుగు కల్చర్, నేటివిటీ అనేది హిందీ హీరోయిన్ల కన్నా తెలుగు అమ్మాయిలకే అర్థమవుతుంది. రియాలిటీకి దగ్గరగా ఉండే, ఇంట్రెస్టింగ్‌ , ఛాలెంజింగ్‌ పాత్రలంటే ఇష్టం. ఓటీటీలో డిఫరెంట్‌ సబ్జెక్ట్స్‌ వస్తున్నాయి. అలాంటి అవకాశం నాకు వచ్చి, పాత్ర ఆసక్తిగా అనిపిస్తే చేస్తాను’’ అని చెప్పారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా