వయసు 5.. చిత్రాలు 20

2 Oct, 2018 08:47 IST|Sakshi

బాలనటిగా రాణిస్తున్న సిద్దీక్ష

ఆ చిన్నారి వయసు కేవలం ఐదేళ్లు. కానీ ఇప్పటికే 20 చిత్రాల్లో నటించింది. మరికొన్ని చిత్రాల్లో నటిస్తోంది. మూడేళ్లకే తెరంగేట్రం చేసిన సిద్దీక్ష.. బాలనటిగా ‘భళా’ అనిపించుకుంటోంది.  

రామంతాపూర్‌: రామంతాపూర్‌కు చెందిన సతీష్‌కుమార్, స్రవంతి దంపతుల కుమార్తె సిద్దీక్ష. ప్రస్తుతం హబ్సిగూడలోని నెక్టŠస్‌ వండర్‌ కిడ్స్‌ స్కూల్‌లో యూకేజీ చదువుతోంది. సిద్దీక్షకు నటనపై ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని ప్రోత్సహించారు. అలా మూడేళ్లకే తెరంగేట్రం చేసిన బేబీ సిద్దీక్ష ఇప్పటికే 20కిపైగా చిత్రాల్లో నటించింది. బాలనటిగా రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. రాధా, డీజే, లవర్స్, సాక్ష్యం, హ్యాపీ వెడ్డింగ్, ఆచారి అమెరికా యాత్ర, దేశంలో దొంగలు పడ్డారు తదితర చిత్రాల్లో నటించిన సిద్దీక్ష.. ఇటీవల విడుదలైన ‘యూటర్స్‌’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రభాస్‌ నటిస్తోన్న ‘సాహో’, మహేశ్‌బాబు ‘మహర్షి’, కన్నడలో ఉపేంద్ర మూవీ ‘హోమ్‌ మినిస్టర్‌’ చిత్రాల్లోనూ నటిస్తోంది.  

యాడ్స్‌లోనూ...
సిద్దీక్ష తెలుగు, కన్నడ చిత్రాలతో పాటు వాణిజ్య ప్రచార చిత్రాల్లోనూ నటించింది. కపిల్‌ చిట్‌ఫండ్, డాక్టర్‌ కాప్‌ బాటిల్‌ తదితర యాడ్స్‌లో చేసింది. ఇప్పుడు మరిన్ని అవకాశాలు వస్తున్నాయని చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు. యూటర్న్‌ చిత్రంలో భాగంగా అర్ధరాత్రి రైలు పట్టాలపై సీన్‌ ఉంటుంది. ఇది సిద్దీక్ష ఏమాత్రం భయపడకుండా చేసింది. ఓయూ సమీపంలోని జామై ఉస్మానియా స్టేషన్‌లో ఈ సన్నివేశం చిత్రీకరించారు. ఇందులో సిద్దీక్ష భయపడకుండా ఎంతో ధైర్యంగా నటించిందని పలువురు అభినందించారు. హీరో నాగార్జున, సమంత, ఎంపీ కవిత సిద్దీక్షపై ప్రశంసల వర్షం కురిపించారు. చిన్న వయసులోనే అసమాన ప్రతిభతో దూసుకెళ్తున్న సిద్దీక్ష మంచి నటిగా ఎదగాలని ఆశీర్వదిద్దాం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు