తమిళంలో చిన్మయి గొంతు వినిపించదు

19 Nov, 2018 02:22 IST|Sakshi
చిన్మయి

‘మీటూ’ ఉద్యమం గురించి సింగర్, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి నిర్భయంగా మాట్లాడిన సంగతి గుర్తుండే ఉంటుంది. తన ట్వీటర్‌ ఖాతా ద్వారా చాలా మంది అజ్ఞాత స్త్రీల ఆరోపణలకు గొంతునిచ్చారు. ప్రముఖ పాటల రచయిత వైరముత్తు, నటుడు రాధారవి మీద ఆరోపణలు చేశారు. వీటివల్ల మీకు అవకాశాలేమైనా తగ్గుతాయనుకుంటున్నారా? అని ఆ మధ్య ‘సాక్షి’ అడిగినప్పుడు ‘అలాంటిదేం లేదు. ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కొంటా’’ అని చిన్మయి అన్నారు. మరి.. తాజా పరిణామాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. విషయం ఏంటంటే.. చిన్మయిని డబ్బింగ్‌ అసోసియేషన్‌ నుంచి తొలగించారు.

‘‘నన్ను డబ్బింగ్‌ యూనియన్‌ నుంచి తొలగించారు. అంటే.. ఇక తమిళ సినిమాలకు డబ్బింగ్‌ చెప్పలేను. రెండు సంవత్సరాలుగా నేను యూనియన్‌ ఫీజŒ  కట్టలేదన్నదాన్ని కారణంగా చూపించారు. కానీ, ఇన్ని రోజులు డబ్బింగ్‌ చెప్పడం వల్ల నాకొచ్చిన ఆదాయంలో 10శాతం తీసుకున్నారు. పాత బకాయిలున్నట్టు మెసేజ్‌ కానీ, లెటర్‌ కానీ పంపకుండా నా మెంబర్‌షిప్‌ తొలగించారు. మళ్లీ తమిళ సినిమాలకు డబ్‌ చేస్తానో లేదో తెలియదు’’ అని చిన్మయి ట్వీట్‌ చేశారు. విశేషం ఏంటంటే.. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌కు రాధారవి ప్రెసిడెంట్‌.

మరిన్ని వార్తలు