నామినేషన్‌ తిరస్కరణ

7 Feb, 2020 03:10 IST|Sakshi
గాయని చిన్మయి

కోర్టుని ఆశ్రయించనున్న చిన్మయి

తమిⶠ ఇండస్ట్రీలో జరిగిన డబ్బింగ్‌ యూనియన్‌ ఎన్నికలపై ఎప్పుడూ లేని ఆసక్తి నెలకొంది. దానికి కారణం ప్రెసిడెంట్‌ పదవికి రాధారవిపై పోటీగా డబ్బింగ్‌ ఆర్టిస్ట్, గాయని చిన్మయి నామినేషన్‌ వేయడమే. గతంలో ప్రముఖ రచయిత వైరముత్తు, నటుడు రాధారవిపై ‘మీటూ’  ఉద్యమంలో భాగంగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు చిన్మయి. ఆ తర్వాత డబ్బింగ్‌ యూనియన్‌ సభ్యత్వం నుంచి ఆమె తొలగించబడ్డారు. కానీ కోర్టు నుంచి ఇంటర్న్‌ ఆర్డర్‌ (చిన్మయిని యూనియన్‌ సభ్యురాలిగా పరిగణించాలి) తెచ్చుకున్నారు చిన్మయి.

ఆ తర్వాతే రామరాజ్యం పార్టీ తరఫున డబ్బింగ్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ పదవికి నామినేషన్‌ వేశారామె. అయితే చిన్మయి నామినేషన్‌ తిరస్కరణకు గురయింది. దాంతో రాధారవి ప్రెసిడెంట్‌ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ‘‘ఎలక్షన్‌ కమిషనర్‌ నేను  సభ్యురాలిని కాదని నామినేషన్‌ తిరస్కరించారు. నా వద్ద కోర్ట్‌ ఇంటర్న్‌ ఆర్డర్‌ ఉన్నప్పటికీ ఎందుకు సభ్యురాలిగా  పరిగణించలేదో అర్థం కావడం లేదు. ఎవరి సూచనల మేరకు ఈ పని చేశారు? రాధారవి ఆజ్ఞ మేరకా? ఈ విషయంపై న్యాయపరంగా పోరాడతాను’’ అని ట్వీటర్‌లో పేర్కొన్నారు చిన్మయి.

మరిన్ని వార్తలు