సాంగ్‌తో షురూ

5 Nov, 2019 01:20 IST|Sakshi
చిరంజీవి

చిరంజీవి సినిమా అంటే పాటలు, అందులో ఆయన వేసే స్టెప్స్‌ హైలైట్‌. అయితే ‘సైరా’ సినిమాలో అవి మిస్‌ అయ్యాయి. అందుకే ఇప్పుడు చేసే సినిమాలో ఆ కొరతను తీర్చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ హైలైట్‌ పాయింట్‌తోనే చిరంజీవితో చేయబోయే సినిమాను ప్రారంభిస్తున్నారట దర్శకుడు కొరటాల శివ. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సామాజిక చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటించబోతున్నారని టాక్‌. ఈ సినిమా చిత్రీకరణను పాటతో మొదలుపెట్టాలని చిత్రబృందం ప్లాన్‌ చేశారని తెలిసింది. డిసెంబర్‌ మొదటివారంలో సెట్స్‌ మీదకు వెళ్లనుందట. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తారని సమాచారం.

మరిన్ని వార్తలు