ఆశ పెట్టుకోవడం లేదు

12 Nov, 2019 01:38 IST|Sakshi
రామ్‌చరణ్‌

రామ్‌చరణ్‌ నటించిన ‘మగధీర, బ్రూస్‌లీ’ సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించారు ఆయన తండ్రి చిరంజీవి. ఆ సన్నివేశాలకు మంచి స్పందన లభించింది. చిరంజీవి కమ్‌బ్యాక్‌ చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’లోని ‘అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు...’ పాటలో తండ్రితో కలిసి స్టెప్పులేశారు రామ్‌చరణ్‌. మీ నాన్నగారితో కలసి ఫుల్‌ సినిమాలో నటించాలని లేదా? అనే ప్రశ్నను చరణ్‌ని అడిగితే ఈ విధంగా బదులిచ్చారు. ‘‘సైరా’ సినిమా కథా చర్చలు నడుస్తున్నప్పుడు షేర్‌ఖాన్‌ అనే అతిథి పాత్ర నాకు ఉంటుందని చెప్పారు. అయితే చర్చలు పూర్తయ్యేసరికే నా పాత్రను పేపర్‌ మీదే ఎడిట్‌ చేసేశారు.

‘మేమిద్దరం కలసి నటిస్తాం’ అని ఈ మధ్య ఓ సందర్భంలో నాన్నగారు చెప్పారు. అయితే అది ఏ సినిమాను ఉద్దేశించి అన్నారో నాకు కూడా తెలియదు. ప్రస్తుతం నాన్నగారు మూడు నాలుగు కథలు విన్నారు. ఏ కథలో, ఏ పాత్రలో నన్ను చూస్తున్నారో ఆయనకు మాత్రమే తెలుసు. ఆల్రెడీ ‘సైరా’లో నా పాత్ర ఉంటుందన్నారు. లేదు. అందుకే ముందే ఆశపెట్టుకోవడం లేదు. ‘కథలో నువ్వుంటే బావుంటుంది’ అని ఆయన ఎప్పుడు చెబితే అప్పుడు నాన్నగారితో కలిసి నటిస్తాను’’ అని పేర్కొన్నారు రామ్‌చరణ్‌. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించనున్న సినిమాను రామ్‌చరణే నిర్మించనున్నారు. ‘ఖైదీ నంబర్‌ 150’, ‘సైరా’కి కూడా చరణే నిర్మాత అనే సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా