అలనాటి తారలతో చిరు స్టెప్పులు.. వీడియో వైరల్‌

4 May, 2020 14:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : ఇటీవల సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన  మెగాస్టార్‌ చిరంజీవి.. నిత్యం తన అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. ఒకవైపు కరోనాపై అవగాహన కల్పిస్తూనే తన అభిమానులకు కావాల్సినంత ఫన్‌ అందిస్తున్నాడు. తాజాగా చిరంజీవి అలనాటి హీరోయిన్లు అయిన సుహాసిని, ఖుష్బూ, జయసుధ, రాధ, రాధక, లిజి ప్రియదర్శన్‌లతో కలసి స్టెప్పులేసిన వీడియోను తన ట్వీటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు.. గత ఏడాది చిరంజీవి కొత్త ఇంటిలో ఈ రీయూనియన్ జరిగింది.
(చదవండి : మేమంతా మీకు రుణపడి ఉన్నాం : చిరంజీవి)

ఈ రియూనియన్‌ వేడుకకి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ నటీనటులు ఒక చోట కలిసి సందడి చేశారు. వెంకటేష్, నాగార్జున, మోహన్‌లాల్, రాధిక, శరత్ కుమార్, ప్రభు, రెహమాన్, భానుచందర్, నరేష్‌, సురేష్‌, జయసుధ, నదియా, రమ్యకృష్ణ, శోభన, సుహాసిని, రేవతి, సుమలత, రాధ, లిజి, పూర్ణిమ, భాగ్యరాజ్‌, జాకీ ష్రాఫ్‌, జగపతిబాబు తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో నటీనటులంతా చాలా హ్యాపీగా గడిపారు. ఆటపాటలతో కలసి సందడి చేశారు. ఇందులో సుహాసినితో రాక్షసుడు సినిమాలోని మళ్లీ మళ్లీ ఇది రాని రోజు పాటకు డాన్స్‌ చేశాడు. ఆ తర్వాత చిరు.. రాధతో మరణ మృదంగంలోని సరిగమ పదనిస పాటకు చిందేసారు. ఆ తర్వాత కుష్బూతో ఘరానా మొగుడు సినిమాలోని బంగారు కోడిపెట్ట పాటకు కాలు కదిపాడు. ఈ పాటకు కుష్బూతో పాటు జయప్రద,జయసుధ తదితరులు స్టెప్పులు వేశారు. 
(చదవండి : మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్’ ఉడకదురా: చిరు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు