‘ఆచార్య’లో మహేశ్‌.. చిరు స్పందన

6 Apr, 2020 08:47 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఆచార్య. మ్యాటినీ ఎంటర్‌ టైన్‌మెంట్‌, కొనిదల ప్రొడక్షన్‌ బ్యానర్స్‌పై రామ్‌ చరణ్‌, నిరంజన్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్‌ నటిస్తోంది. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. కాగా,ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు నటిస్తున్నరనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  దీనిపై అటు ఆచార్య చిత్ర బృందం కానీ, మహేశ్‌ బాబు కానీ స్పందించలేదు.

తాజాగా ఈ పుకార్లపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. ఓ ప్రముఖ ప‌త్రిక‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. అసలు ఆచార్యలో మ‌హేష్ న‌టిస్తున్నాడ‌న్న వార్త ఎలా బ‌య‌ట‌కి వ‌చ్చిందో అర్ధం కావ‌డం లేదు అని అన్నారు. మహేశ్‌ ఎంతో అద్భుతమైన స్టార్ అని, తనతో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చెప్పారు. ‘మ‌హేశ్‌ని నేను చాలా గౌర‌విస్తాను. ఆయ‌న కూడా న‌న్ను అంతే ప్రేమిస్తారు. మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు. ఆయన తో క‌లిసి సినిమా చేసే ఛాన్స్ వ‌స్తే త‌ప్పక చేస్తాను. కానీ ఆచార్యలో నటించమని ఆయనను మా టీమ్‌ సంప్రదించలేదు. అ వార్తలు అన్ని అవాస్తం’  అని చిరు స్పష్టం చేశారు.

ఇక ఓ పాత్రకు ముందునుంచి రామ్ చరణ్ అయితే బాగుంటుందని దర్శకుడు కొరటాల అనుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చరణ్  రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌లో  నటిస్తున్నాడని, దీంతో తమ సినిమాకు డేట్స్‌ ఇవ్వడం కష్టమే అన్నారు.  ఈ విషయమై దర్శకులు రాజమౌళి, కొరటాల కలిసి చర్చించి ఒక ఒప్పందానికి వస్తే 'ఆచార్య'లో చరణ్ ఉండొచ్చుని చిరు వెల్లడించాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా