నవిష్క..వేడుక

27 Dec, 2019 00:21 IST|Sakshi
నవిష్కతో చిరంజీవి

చిరంజీవి కుటుంబంలో డిసెంబర్‌ 25న రెండు పండగలు జరిగాయి. ఒకటి క్రిస్మస్‌ సెలబ్రేషన్‌ కాగా మరోటి చిరంజీవి మనవరాలు నవిష్క పుట్టినరోజు వేడుక. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, కల్యాణ్‌ దేవ్‌ల కూతురు నవిష్క. ఈ చిన్నారికి మొదటి పుట్టినరోజు ఇది. ఈ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసింది చిరంజీవి ఫ్యామిలీ. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు ఉపాసన. ‘‘హ్యాపీ బర్త్‌డే డార్లింగ్‌ నవిష్క. మీ అత్తామామ (ఉపాసన, రామ్‌చరణ్‌)కు నువ్వంటే చాలా ప్రేమ’’ అని ఈ ఫొటోలను షేర్‌ చేశారు.
 
 కల్యాణ్‌ దేవ్, నవిష్క, శ్రీజ, రామ్‌చరణ్, ఉపాసన

మరిన్ని వార్తలు