జూన్‌లో జాయినింగ్‌

5 Apr, 2019 03:52 IST|Sakshi
చిరంజీవి

‘సైరా’ కోసం స్వాతంత్య్ర సమర యోధుడిగా మారిన చిరంజీవి ఆ చిత్రం పూర్తి కాగానే సోషల్‌ డ్రామా జానర్‌లోకి షిఫ్ట్‌ కావడానికి రెడీ అయ్యారు. ‘సైరా’ సెట్స్‌ మీద ఉండగానే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఓ చిత్రాన్ని అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నెల చివర్లో ఈ చిత్రం ముహూర్తం జరుగుతుంది. స్క్రిప్ట్‌ పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్‌ పనులు ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతున్నాయని తెలిసింది.

ఆల్రెడీ ఈ సినిమాలో చిరు లుక్‌కు సంబంధించిన లుక్‌ టెస్ట్‌ కూడా పూర్తయింది. ఈ సినిమాను రామ్‌చరణ్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు కలసి నిర్మించనున్నాయి. ఇందులో హీరోయిన్‌గా శ్రుతీహాసన్‌ పేరుని పరిశీలిస్తున్నారట చిత్రబృందం. జూన్‌ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. ప్రస్తుతం సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న ‘సైరా’ ఈ ఏడాది సెకండ్‌ హాఫ్‌లో రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా