72లో విన్నాను.. మళ్లీ ఇప్పుడు వింటున్నా: చిరంజీవి

19 Nov, 2019 16:12 IST|Sakshi

‘1972లో నేను ఒంగోలులో ఇంటర్‌ చదువుతున్నప్పుడు తొలిసారి జార్జిరెడ్డి పేరు విన్నాను. ఆ తర్వాత మళ్లీ  ఇన్నాళ్లకు ‘జార్జిరెడ్డి: ఎ మ్యాన్‌ ఆఫ్‌ యాక్షన్‌’పేరుతో తీస్తున్న ఈ సినిమాతో మళ్లీ ఆ పేరు వింటున్నా. ఈ పాట చూసిన తర్వాత ఎక్సైట్‌కు లోనయ్యాను. ‘అడుగు.. ఆడుగు’సాంగ్‌ చూసిన దాని బట్టి అప్పట్లో నేను విన్నదాన్ని బట్టి, ఆయన ఎలాంటి ఆశయాలతో ఉండేవారు? ఏ విధంగా విప్లవకారుడిలా ఉండేవారు? అన్యాయం జరిగినా, అణచివేత జరిగినా, విద్యార్ది నాయకుడిగా జార్జిరెడ్డి ఎలా స్పందించే వారో ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారని అర్థమవుతోంది. ఇలాంటి సినిమాలు రావాలి. నేటితరం జార్జిరెడ్డితో కనెక్ట్‌ అవుతారని, ఈ కంటెంట్‌ ప్రతీ ఒక్కరికీ నచ్చుతుందని మనస్పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు. ఈ చిత్రాన్ని ప్రతీ ఒక్కరూ చూడండి. నేను కూడా ఎంతో ఆసక్తితో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’అని​ పేర్కొన్నారు మెగాస్టార్‌ చిరంజీవి.  

ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్‌ లీడర్‌ జార్జిరెడ్డి కథను ‘జార్జిరెడ్డి’ పేరుతో వెండితెరపైకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ‘వంగవీటి’ ఫేమ్‌ సందీప్‌ మాధవ్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. జీవన్‌ రెడ్డి దర్శకత్వంలో అప్పిరెడ్డి నిర్మించారు. ఇదివరకే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్‌ 22న విడుదల కానుంది. ఇప్పటికే చిత్ర యూనిట్‌ మూవీ ప్రమోషన్స్‌ను భారీగా ప్లాన్‌ చేస్తుంది. దీనిలో భాగంగా ట్రైలర్‌, మూవీలోని ఒక్కొ సాంగ్‌ను రిలీజ్‌ చేస్తూ సినిమాపై హైప్‌ను క్రియేట్‌ చేస్తున్నారు. తాజాగా చిత్రంలోని ‘అడుగు.. అడుగు’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ వీడియోను చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు చిరంజీవి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ‘అడుగు.. అడుగు’ సాంగ్‌ సినీ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. కాగా, సత్య దేవ్, మనోజ్‌ నందన్, చైతన్య కృష్ణ, వినయ్‌ వర్మ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సురేశ్‌ బొబ్బిలి మ్యూజిక్‌ను అందించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా