చిరు ముచ్చటగా మూడు నిమిషాలే!

28 Sep, 2015 19:15 IST|Sakshi
చిరు ముచ్చటగా మూడు నిమిషాలే!

హైదరాబాద్ : సుమారు ఎనిమిదేళ్ల విరామం అనంతరం మెగాస్టార్ చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకున్నాడు.  చిరంజీవి తన వారసుడు రామ్ చరణ్ తాజా చిత్రం 'బ్రూస్ లీ' లో 'చిరు' పాత్ర చేయబోతున్నాడు.  గతంలో కూడా 'మగధీర'లో తనయుడితో కలిసి సెప్ట్లు వేసిన చిరంజీవి ...మళ్లీ కొడుకుతో కలిసి నటిస్తున్నాడు.    శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రూస్ లీ లో చిరు మూడు నిముషాల పాటు సందడి చేయబోతున్నాడు.  చిరంజీవి సోమవారం బ్రూస్ లీ షూటింగ్ స్పాట్కు వచ్చాడు.

అయితే ఈ షూటింగ్ వ్యవహారాన్ని సింపుల్ గా చేయకుండా అత్యంత గ్రాండ్గా ఉండేలా దర్శకుడు శ్రీనువైట్ల సన్నాహాలు చేశాడు. హైటెక్ పరిసర ప్రాంతాల్లో చిరంజీవి ఎపిసోడ్కి సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో హెలికాప్టర్లు, గుర్రల్ని వాడుతున్నారు. అంతేకాకుండా మెగా అభిమానులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియచేస్తున్న దృశ్యాన్ని చిరంజీవి ఇంట్రడక్షన్ సీన్గా తీస్తున్నట్లు సమాచారం.   

ఇంద్ర, స్టాలిన్ సినిమాల స్థాయిలో భారీ సంఖ్యలో అభిమానుల మధ్య ఈ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారట.  కాగా చిరంజీవి ఈసినిమాలో రియల్ మెగాస్టార్గా కనిపిస్తున్నట్లు టాక్‌. అక్టోబర్‌ 2న జరిగే ఆడియోలో చిరంజీవికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్‌ చేయనుంది‌.  అక్టోబర్ 16న బ్రూస్ లీ మూవీ రిలీజ్ కాబోతోంది.  కాగా మెగాస్టార్ ని శ్రీను వైట్ల ఎలా చూపించబోతున్నాడా అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి