కాంబినేషన్‌ రిపీట్‌?

11 Dec, 2018 03:00 IST|Sakshi
చిరంజీవి, నయనతార

‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రం సెట్స్‌ మీద ఉండగానే కొరటాల శివతో ఓ సినిమాను ఓకే చేశారు చిరంజీవి. అందులో హీరోయిన్‌గా నయనతారను కన్‌ఫార్మ్‌ చేసినట్టు ఫిల్మ్‌నగర్‌ సమాచారం. కెరీర్‌లో ఫ్లాప్స్‌ లేని దర్శకుడు కొరటాల శివ. తాజాగా ఆయన చిరంజీవి కోసం ఓ సోషల్‌ మెసేజ్‌తో కూడుకున్న కమర్షియల్‌ స్టోరీ రెడీ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి స్టార్ట్‌ కానుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుష్క, తమన్నా అంటూ కొందరి హీరోయిన్ల పేర్లు వినిపిస్తూ వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నయనతార పేరుని ఓకే చేశారట చిత్రబృందం. చిరు, నయన్‌ ప్రసుత్తం ‘సైరా’ చిత్రంలో యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్‌ అయితే బావుంటుందని భావించారేమో చిత్రబృందం. దాంతో మరోసారి చిరంజీవి పక్కన నటించే చాన్స్‌ కొట్టేశారు నయనతార. మరి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాలి.

మరిన్ని వార్తలు