చిరంజీవి ఉప్మా పెసరట్టు...

23 Apr, 2020 09:58 IST|Sakshi

ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘బి ది రియల్‌ మ్యాన్‌’ ట్రెండ్‌ కొనసాగుతుంది. ఇంటి పనులను మగవాళ్లు కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో దర్శకుడు సందీప్‌ వంగ స్టార్‌ చేసిన  ‘బీ ది రియల్‌ మ్యాన్‌’  ఛాలెంజ్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. తాజాగా హీరో ఎన్టీఆర్‌ నుంచి ఈ చాలెంజ్‌ను స్వీకరించిన మెగాస్టార్‌ చిరంజీవి.. దానిని విజయవంతంగా పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో చిరంజీవి తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ఈ చాలెంజ్‌లో భాగంగా ఇల్లు శుభ్రం‌ చేయడంతోపాటు తన తల్లి అంజనాదేవికి చిరు ఉప్మా పెసరట్టు వేసి పెట్టారు. ఈ సందర్భంగా అంజనాదేవి.. చిరుకు పెసరట్టు తినిపించారు.

ఈ చాలెంజ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను, హీరో రజనీకాంత్‌ను చిరంజీవి నామినేట్‌ చేశారు. ‘భీమ్‌(తారక్‌) ఇదిగో చూడు.. నేను రోజు చేసే పనులే.. ఇవ్వాళ మీ కోసం. ఈ వీడియో సాక్ష్యం’ అని చిరు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ చాలెంజ్‌ను సినీ ప్రముఖులు రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, కొరటాల శివ, సుకుమార్‌, ఎంఎం కీరవాణి విజయవంతంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి : ఈ ఛాలెంజ్‌ కూడా కరోనాలానే ఉంది

బాలయ్య, చిరులకు ఎన్టీఆర్‌ చాలెంజ్

ప్రేమలే కాదు పనులూ పంచుకుందాం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు