‘పహిల్వాన్‌’పై ‘చిరు’ ప్రశంసలు

4 Jun, 2019 17:58 IST|Sakshi

కన్నడ సూపర్‌స్టార్‌ కిచ్చా సుదీప్‌ పహిల్వాన్‌తో ప్రేక్షకులను పలకరించబోతోన్న సంగతి తెలిసిందే. పహిల్వాన్‌కు సంబంధించి అప్పట్లో విడుదలైన పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కుస్తీ వీరుడుగా నటించనున్న సుదీప్‌ లుక్‌కు అందరూ ఫిదా అయ్యారు. తాజాగా సుదీప్‌ లుక్‌పై మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

చిరంజీవి నటిస్తున్న సైరా సినిమాలో సుదీప్‌ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సుదీప్ నటిస్తున్న మరో చిత్రం పహిల్వాన్‌ విడుదలకు సిద్దంగా ఉంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌ కార్యక్రమాలను మొదలుపెట్టిన చిత్రయూనిట్‌.. టాలీవుడ్‌లో సినిమాపై హైప్‌ను క్రియేట్‌చేయించేందుకు చిరంజీవిని రంగంలోకి దించారు.

ఈ మూవీపై చిరు స్పందిస్తూ.. విలక్షణ నటుడు, నిబద్దత కలిగిన సుదీప్‌ ప్రస్తుతం పహిల్వాన్‌గా మనముందుకు రాబోతున్నాడని, రియల్‌ పహిల్వాన్‌ లుక్‌లోకి మారడానికి సుదీప్‌ ఎంతో కష్టపడ్డారని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు