పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్‌: చిరు

10 Apr, 2020 13:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండు తెలుగురాష్ట్రాల పోలీసుల పనితీరుపై మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడుతున్నారని ప్రశంసించారు. కరోనా నియంత్రణలో పోలీసుల కృషి అమోఘమని కొనియాడిన చిరంజీవి సామాన్య జనం వారికి సహకరించాలని కోరారు. ఓ పోలీసు బిడ్డగా వారు చేస్తున్న విశేష కృషికి సెల్యూట్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు.  ఈ మేరకు శుక్రవారం చిరు తన అధికారిక ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. 

‘రెండు తెలుగు రాష్ట్రాల పనితీరు అద్భుతం. నిద్రాహారాలు మాని వాళ్లు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్‌లో స్వయంగా చూస్తున్నాను. వారి పనితీరు వల్ల లాక్‌డౌన్‌ చాలా విజయవంతంగా జరిగిందనే చెప్పాలి. అలా జరగబట్టే ఈ కరోనా విజృంభణ చాలా వరకు అదుపులోకి వచ్చింది. అలాగే నేను ప్రతీ ఒక్కరికి వేడుకుంటున్నాను. సామాన్య జనం కూడా పోలీసులకు సహకరించాలి. ఈ కరోనాను తుదిముట్టించడంలో, ఆంతమొందించడంలో వారికి చేదోడు వాదోడుగా ఉండాలి సహకరించాలి. పోలీసు వారు చేస్తున్న అమోఘమైనటువంటి ఈ ప్రయత్నానికి పోలీసు బిడ్డగా వారికి చేతులెత్తి సెల్యూట్‌ చేస్తున్నా.. జైహింద్‌’అంటూ చిరు ఆ వీడియోలో పేర్కొన్నారు. కాగా, పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతు చిరంజీవి పోస్ట్‌ చేసిన వీడియోపై తెలంగాణ డీజీపీ కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది. 

చదవండి:
చిరు ట్వీట్‌పై స్పందించిన పవన్‌ కల్యాణ్‌
అకీరా బర్త్‌డే.. చిరు ఆకాంక్ష అదే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు