ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం: చిరంజీవి

8 Apr, 2020 08:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి హనుమాన్‌కు పరమ భక్తుడు అన్న విషయం తెలిసిందే. ఆంజనేయస్వామికి మరో పేరైన చిరంజీవిని తన స్క్రీన్‌ పేరుగా మార్చుకొని ఏ స్థాయికి ఎదిగారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే నేడు హనుమాన్‌ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షాలు తెలిపారు. అంతేకాకుండా ఆంజనేయస్వామితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. 

‘ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది...చిన్నప్పటి నుంచి...1962 లో నాకు  ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా?.. ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, "ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు  అలానే ఉన్నాయి" అన్నారు. అప్పటి నా ఫోటో’ 

‘కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు  నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా?.. బాపు గారు చెప్పిన మాట "ఏంటోనండి ...బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి ...అలానే ఉంచేసాను ...మార్చలేదు " అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు. ఇవ్వాల్టి తారీఖుతో కూడా నాకు అనుబంధం ఉంది’ అంటూ మెగాస్టార్‌ ట్వీట్‌ చేశారు.

చదవండి:
పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా
రియల్‌ 'హీరో'ల్‌

 

మరిన్ని వార్తలు