చివరి క్షణం

6 Sep, 2019 06:07 IST|Sakshi
కవిత మహతో

ఆదిత్య శశాంక్, కవిత మహతో జంటగా ధర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చివరి క్షణం’. శ్రీరాముల నాగరత్నం సమర్పణలో రత్న మేఘన క్రియేషన్స్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ధర్మ, శ్రీరాముల నాగరత్నం మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. శ్రీకాంత్‌గారు విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌కి విశేష స్పందన వచ్చింది. హైదరాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో టాకీ పార్ట్, ఒక పాట చిత్రీకరించాం. మిగిలిన మూడు పాటలను గోవాలో చిత్రీకరించాం. ఈ నెలాఖరులో ఆడియో విడుదల చేస్తాం’’ అన్నారు. సాకేత్‌ సాయిరామ్, స్నేహ, కోటయ్య, చౌదరి, రాథోడ్, రామ్‌ కుర్నవల్లి, మురళి, రామకృష్ణ, వీఎస్‌ రామరాజు, జ్యోతి, రాంరెడ్డి, దాస్, సంపత్‌ తదితరులు నటించిన ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సతీష్, మహతి జై, వీరేపల్లి ప్రీతం, సంగీతం: సాకేత్‌ సాయిరామ్, కెమెరా: శ్రీనివాస్‌ శ్రీరాములు. 

మరిన్ని వార్తలు