మరోసారి పోలీస్‌ పవర్‌ చూపించడానికి..

6 Apr, 2018 10:45 IST|Sakshi
సామి 2 షూటింగ్‌లో హరి, విక్రమ్‌

తమిళ సినిమా: కోలీవుడ్‌లో పోలీసు కథలతో చాలా చిత్రాలు వచ్చాయి. ఇంకా వస్తాయి కూడా. అయితే అలాంటి పోలీస్‌ కథా చిత్రాల్లో సామి చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకుంటే నటుడు విక్రమ్‌కు స్టార్‌ ఇమేజ్‌ను ఆపాదించిన అతి కొద్ది చిత్రాల్లో సామి ఒకటి. అదేవిధంగా నటి త్రిషను అగ్రనటిగా నిలబెట్టిన చిత్రం సామినే. కమర్శియల్‌ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కించిన సామి చిత్రం ఒక సంచలనం. దానికి సీక్వెల్‌ నిర్మాణం చివరి దశకు చేరుకుంది.

విక్రమ్, హరి కాంబినేషనల్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో క్రేజీ తార కీర్తీసురేశ్‌ నాయకిగా నటిస్తోంది. మరో హీరోయిన్‌గా ముందు నటించడానికి అంగీకరించి ఆ తరువాత వైదొలగి పెద్ద వివాదానికి తెరలేపిన నటి త్రిష మళ్లీ నటించడానికి సమ్మతించినట్లు ప్రచారం జరుగుతోంది. నటుడు బాబీసింహా విలన్‌గా నటిస్తున్నారు. ఇందులో విక్రమ్‌ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక పాత్రలో ఆయన పోలీస్‌ కమిషనర్‌గా కనిపించనున్నారు. అలా పోలీస్‌ అధికారిగా విక్రమ్‌ ఈ చిత్రంలో దుమ్మురేపనున్నార ని సమాచారం.

దర్శకుడు హరి యాక్షన్‌ సన్నివేశాలను బ్రహ్మాండంగా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలను గురువారం చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత దర్శకుడు హరి మరోసారి సూర్యతో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇది సింగం పార్ట్‌ 4 అవుతుందనే ప్రచారం వైరల్‌ అవుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా