పవన్‌ని డీల్ చేయగలడా..?

31 Dec, 2015 09:12 IST|Sakshi
పవన్‌ని డీల్ చేయగలడా..?

కొద్ది రోజులుగా తన సినిమాల విషయంలో అభిమానులను తెగ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అత్తారింటికి దారేది సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న పవన్, గోపాల గోపాల సినిమాలో దేవుడిగా కనిపించి అలరించాడు. అయితే ఆ సినిమాలో పవన్ పాత్ర పూర్తిస్థాయిలో లేకపోవటంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. గబ్బర్సింగ్ సీక్వల్తో చాలాకాలం వార్తల్లో నిలిచినా, ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకురాకుండా ఊరించాడు.

గబ్బర్సింగ్ సీక్వల్కు డైరెక్టర్గా సంపత్ నందిని ప్రకటించినా, ఆ తరువాత పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో ఆ సినిమా చేస్తున్నాడు. కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న బాబీ దర్శకత్వంలో పవన్ సినిమా అంటే అభిమానులు కూడా షాక్ అయ్యారు. మరోసారి అలాంటి షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు పవన్. ప్రస్తుతం టాలీవుడ్ కొరియోగ్రాఫర్గా సూపర్ ఫాంలో ఉన్న జానీ మాస్టర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నాడట.

రేసుగుర్రం, జులాయి, రచ్చ, ఎవడు లాంటి సినిమాలతో కొరియోగ్రాఫర్గా టాప్ రేంజ్కు చేరుకున్నాడు జానీ మాస్టర్. అయితే చాలా రోజులుగా దర్శకుడిగా మారే ప్రయత్నాల్లో ఉన్న జానీ, దాసరి నారాయణరావుకు కథ వినిపించాడు. దాసరి కథ నచ్చటంతో పవన్ హీరోగా తాను నిర్మించాలనుకుంటున్న సినిమాను, జానీ చేతిలో పెట్టే ఆలోచనలో ఉన్నాడట. మరి ఈ ప్రపోజల్కు పవర్ స్టార్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి