సంక్రాంతి సినిమా సక్సెస్ మీట్కు మెగాస్టార్

27 Jan, 2017 15:30 IST|Sakshi
సంక్రాంతి సినిమా సక్సెస్ మీట్కు మెగాస్టార్

రీ ఎంట్రీలో సూపర్ హిట్తో అలరించిన మెగాస్టార్ చిరంజీవి, వీలైనంత వరకు అభిమానులకు కనిపించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమా వేడుకల్లో సందడి చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీ హీరోల ఫంక్షన్స్తో పాటు ఇతర హీరోల సినీ వేడుకల్లో కూడా మెగాస్టార్ తరుచుగా కనిపిస్తున్నాడు.

తాజాగా ఓ యంగ్ హీరో సినిమా సక్సెస్మీట్కు చిరు, చీఫ్ గెస్ట్గా వస్తున్నాడన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్ మారింది. తన రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 రిలీజ్ సమయంలోనే విడుదలయిన శతమానం భవతి సినిమా సక్సెస్మీట్లో చిరంజీవి పాల్గొననున్నారు. ఇలా మెగాస్టార్ చిన్న సినిమాల ఫంక్షన్స్కు హాజరు కావటం ఆ సినిమాలతో పాటు మెగాస్టార్ ఇమేజ్కు కూడా ప్లస్ అవుతుందంటున్నారు విశ్లేషకులు.