హృతిక్ రోషన్ వివాదాస్పద వ్యాఖ్యలు

30 Mar, 2016 13:32 IST|Sakshi
హృతిక్ రోషన్ వివాదాస్పద వ్యాఖ్యలు

ముంబై: బాలీవుడ్ కండల వీరుడికి కష్టాలు వీడడం లేదు. 'క్వీన్'తో ప్రేమాయణం నడిపి వివాదాలపాలైన బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. క్రైస్తవమతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో లీగల్ నోటీసు అందుకున్నాడు. ట్విటర్ లో పోప్ ఫ్రాన్సిస్ పై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని హృతిక్ రోషన్ కు క్రిస్టియన్ సెక్యులర్ ఫోరం లీగల్ నోటీసు పంపింది.

తమ మతాధిపతిని అవమానించడం ద్వారా క్రైస్తవుల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీశారని పేర్కొంటూ 295ఏ సెక్షన్ కింద నోటీసులిచ్చింది. రాష్ట్ర అల్పసంఖ్యాకవర్గాల కమిషన్ మాజీ ఉపాధ్యక్షుడు అబ్రహం మాతాయ్ ఈ నోటీసులు పంపారు. కంగనా రౌనత్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ హృతిక్.. పోప్ పేరు ప్రస్తావించారు. 'ఎవరితోనైనా సన్నిహితంగా మెలిగే హక్కు హృతిక్ రోషన్ కు ఉంది. కానీ తన వ్యక్తిగత వివాదంలోకి పోప్ ఫ్రాన్సిస్ ను లాగడం సమంజసం కాదు. పోప్ పై చేసిన వ్యాఖ్యలకు హృతిక్ బేషరతుగా క్షమాణ చెప్పాల'ని మాతాయ్ డిమాండ్ చేశారు.

>