ఒకేరోజు ముగ్గురు సినీ తారల జన్మదినం

19 Sep, 2019 09:13 IST|Sakshi

బెంగళూరు : కన్నడ చిత్రరంగానికి చెందిన ముగ్గురు నటీనటుల పుట్టినరోజు బుధవారమే కావడంతో అభిమానుల సందడి మిన్నంటింది. సాహససింహ, దివంగత నటుడు విష్ణువర్ధన్, స్టార్‌ నటునిగా పేరున్న ఉపేంద్ర, నటీమణి శృతిల అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా జన్మదిన వేడుకలను జరిపారు. విష్ణు అభిమానులు, వివిధ సంఘ సంస్థలు అభిమాన్‌ స్టూడియోలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. చిత్ర ప్రముఖులు ట్విట్టర్లో ఆయనను స్మరించుకున్నారు.  

నిరాడంబరంగా ఉప్పి జన్మదినం
మరో నటుడు ఉపేంద్ర 52వ పుట్టినరోజును బెంగళూరులో తన ఇంట్లో నిరాడంబరంగా జరుపుకొన్నారు. కేక్, పూల బొకేలు తీసుకురావద్దని అభిమానులకు ఆయన ముందుగానే మనవి చేశారు. పరిసర సంరక్షణ కోసం మొక్కలను తీసుకురావాలని కోరటంతో చాలామంది అభిమానులు మొక్కలను అందజేసి శుభాకాంక్షలను తెలిపారు. నటి, బీజేపీ నాయకురాలు శృతి 44వ జన్మదినంను బెంగళూరులో కేక్‌ కట్‌ చేసి ఆచరించారు.  

విష్ణుకు సీఎం యడ్డి, సుదీప్‌ నివాళులు  
దివంగత నటుడు విష్ణువర్ధన్‌కు సీఎం బీఎస్‌ యడియూరప్ప నివాళులరి్పంచారు. కన్నడ చిత్రరంగానికి అనేక సేవలందించిన్నట్లు ట్విట్టర్‌ ద్వారా కొనియాడారు. ఆయన సినిమాలు, వ్యక్తిత్వం ద్వారా ప్రజల మన్ననలను పొందుతున్నారని తెలిపారు. విష్ణువర్థన్‌ తండ్రి మాదిరిగా ఎంత ప్రీతిని చూపించేవారో, తప్పు చేస్తే అంతే కోప్పడేవారని హీరో సుదీప్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆయన దూరమై అనాథమలయ్యామని ఆవేదనను వ్యక్తం చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు