పాటలు వినిపిస్త మావా!

8 Jul, 2015 00:09 IST|Sakshi
పాటలు వినిపిస్త మావా!

 ‘‘రాజ్ తరుణ్, అవికాగోర్ లది హిట్ పెయిర్. ‘ఉయ్యాల జంపాల’ తర్వాత వీరిద్దరూ కలిసి మళ్లీ నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అని కృష్ణంరాజు ఆకాంక్షించారు. రాజ్‌తరుణ్, అవికాగోర్ జంటగా ఆర్యత్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కీ మీడియా సమర్పణలో లక్కీ మీడియా పతాకంపై బోగాది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, రూపేశ్ డి.గోహిల్, జి. సునీత నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు. శేఖర్‌చంద్ర స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక సోమవారం రాత్రి హదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని సీనియర్ నటుడు కృష్ణంరాజు విడుదల చే సి దర్శకుడు శ్రీనువైట్లకు అందించారు. రాజ్‌తరుణ్ మాట్లాడుతూ -‘‘ఉయ్యాల జంపాల తర్వాత మంచి కథ కోసం గ్యాప్ తీసుకున్నా. ఆ సమయంలోనే దర్శకుడు చెప్పిన ఈ కథ నచ్చింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోలు సునీల్, సందీప్ కిషన్ , నిర్మాత సి.కల్యాణ్ పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి