కొంత లాభం ఊరి కోసం!

5 Aug, 2018 03:18 IST|Sakshi
రాహుల్‌ విజయ్, సురేష్‌ వర్మ, చిన్నికృష్ణ, కార్తికేయ, అహితేజ

పంపిణీరంగంలో ఉన్నవారు నిర్మాతలుగానూ మారుతుంటారు. ఉదాహరణకు ‘దిల్‌’ రాజు ఒకరు. ఇప్పుడు పంపిణీ రంగం నుంచి  సురేశ్‌ వర్మ, అహితేజ బెల్లంకొండలు నిర్మాతలగానూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. ‘సినిమా హాల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ పేరుతో ఈ ఇద్దరూ ఓ బ్యానర్‌ను స్థాపించారు. ఈ బ్యానర్‌ లాంచ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. బ్యానర్‌ లోగోను నిర్మాతలు ‘మధుర’ శ్రీధర్, అశోక్‌ రెడ్డిలతో పాటు ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ ఆవిష్కరించారు.

ఈ బ్యానర్‌లో చిన్నికృష్ణ దర్శకత్వంలో సినిమా రూపొందనుందన్న విషయాన్ని ‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరో కార్తికేయ, ‘ఈ మాయ పేరేమిటో’ హీరో రాహుల్‌ విజయ్‌ అనౌన్స్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘సురేశ్, అహితేజలు బ్యానర్‌ పెడుతున్నారని తెలిసి హ్యాపీ ఫీలయ్యా. వీళ్లు పెద్ద ప్రొడ్యూసర్స్‌ కావాలి. ఈ బ్యానర్‌లో మంచి మంచి సినిమాలు రావాలి’’అన్నారు. ‘‘టీజర్, ట్రైలర్‌ చూడగానే సురేశ్, అహితేజలు ఆ సినిమా స్కేల్‌ను అంచనా వేయగలరు. వీళ్లకు ఇండస్ట్రీలో లాంగ్‌ టర్మ్‌ లైఫ్‌ ఉండాలి’’అన్నారు ‘మధుర’ శ్రీధర్‌.

‘‘వీరిద్దరిలో ఒకరు బాధ్యతను గుర్తు చేస్తే, మరొకరు ధైర్యాన్ని ఇస్తారు. ఇటువంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం అన్నారు’’ చిన్నికృష్ణ. ‘‘వీళ్లు తప్పకుండా సక్సెస్‌ కావాలి’’ అన్నారు ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌. ‘‘సినిమా హాల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇక్కడి వరకు రావడానికి సహకరించిన అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు సురేశ్‌ వర్మ. ‘‘నాకు సినిమా అంటే చిరంజీవిగారే. ఈ వేదిక మీద మా అన్నయ్య ప్రవీణ్‌ను మిస్‌ అవుతున్నాను. మా మొదటి సినిమా నుంచే మాకు వచ్చిన లాభాల్లో కొంత మా ఊరి బాగు కోసం ఖర్చుపెడతాం’’ అన్నారు అహితేజ.

మరిన్ని వార్తలు