2 Jan, 2018 10:05 IST|Sakshi

సినీరంగంలో సాంకేతిక నిపుణులుగా ప్రూవ్ చేసుకున్న చాలా మంది.. దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్లుగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నవారు దర్శకులుగానూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే సంతోష్ శివన్, తేజ, రసూల్ ఎల్లోర్, గోపాల్ రెడ్డి లాంటి వారు దర్శకులుగానూ సత్తా చాటారు. అదే బాటలో మరో యువ సినిమాటోగ్రాఫర్, దర్శకుడిగా మారబోతున్నాడు.

భలే భలే మొగాడివోయ్, నేను లోకల్, మహానుభావుడు సినిమాలకు సినిమాటోగ్రఫి అందించిన నిజార్ షఫీ, త్వరలో ఓ ద్విభాషా చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. తన తొలి ప్రయత్నానికి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడు నిజార్. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరెకెక్కనున్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటించనున్నారు. అంజలి, అనీషా ఆంబ్రోస్, శ్రద్ధ శ్రీనాథ్, నందిత శ్వేతలు కీలక పాత్రలో తెరకెక్కనున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించనున్నారు.

మరిన్ని వార్తలు