క్లారిటీ ఇచ్చిన ‘ఆఫీసర్‌’ టీం

11 Mar, 2018 11:57 IST|Sakshi
‘ఆఫీసర్‌’ సినిమాలో నాగార్జున, మైరా సరిన్‌

రాజుగారి గది 2 తరువాత లాంగ్ గ్యాప్‌ తీసుకున్న సీనియర్‌ హీరో నాగార్జున ప్రస్తుతం రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఆఫీసర్‌ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. శివ లాంటి ట్రెండ్‌ సెట్టర్ సినిమాను అందించిన కాంబినేషన్‌ కావటంతో ఆఫీసర్‌ పై మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. నాగ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్‌ రైట్స్‌ భారీ మొత్తానికి అమ్ముడైనట్టుగా కొద్ది రోజలుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలపై స‍్పందించిన చిత్రయూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆఫీసర్‌ చిత్రం నిర్మాణదశలోనే ఉందని.. ఇంకా బిజినెస్‌ జరగలేదంటూ క్లారిటీ ఇచ్చింది. రామ్ గోపాల్‌వర్మ కు చెందిన నిర్మాణ సంస్థ ‘కంపెనీ’ సీఈఓ సుధీర్‌ చంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. నాగార్జున సరసన మైరా సరీన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మే 25న రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు